ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పాజిటివ్‌ కేసులు 87

ABN, First Publish Date - 2021-10-21T07:04:27+05:30

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 246043కు పెరిగింది. కొవిడ్‌ మరణాలు మాత్రం 48 గంటలుగా నమోదు కాలేదు. కాగా బుధవారం ఉదయానికి జిల్లాలో 945 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ వెల్లడించింది. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 24, పీలేరులో 13, తిరుపతి రూరల్‌, మదనపల్లె మండలాల్లో 7 చొప్పున, చంద్రగిరి, కేవీపల్లె మండలాల్లో 6 వంతున, కలికిరిలో 3, రేణిగుంట, శ్రీకాళహస్తి, పులిచెర్ల, వడమాలపేట మండలాల్లో 2 చొప్పున, చిత్తూరు, పుంగనూరు, పెనుమూరు, వాల్మీకిపురం, చౌడేపల్లె, శ్రీరంగరాజపురం, చిన్నగొట్టిగల్లు, పెద్దపంజాణి, బీఎన్‌ కండ్రిగ, ఎర్రావారిపాలెం, కేవీబీపురం, నిండ్ర, పీటీఎం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


8 మంది కరోనా బాధితుల డిశ్చార్జి

స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల నుంచి బుధవారం కొవిడ్‌ నుంచి కోలుకున్న 8 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు.స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో మరో 44 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే 19 మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారు.రుయాలో 38 మంది కరోనా చికిత్స పొందుతుండగా 16 మంది బ్లాక్‌ ఫంగ్‌సతో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-10-21T07:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising