ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసురు వాన

ABN, First Publish Date - 2021-11-29T06:21:15+05:30

తంబళ్లపల్లెలో ఆదివారం ముసురు వాన కురిసింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఎడ తెరిపిలేకుండా తేలికపాటి చిరుజల్లులు కురుస్తూనే వున్నాయి. ములకలచెరువు: మండలంలో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.పెద్దమండ్యం: మండలంలో ఆదివారం చిన్నపాటి వర్షం కురిసింది.

టమోటా తోటలో నీళ్లు నిలిచి రాలిపోయిన కాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంబళ్లపల్లె, నవంబరు 28: తంబళ్లపల్లెలో ఆదివారం ముసురు వాన కురిసింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఎడ తెరిపిలేకుండా తేలికపాటి చిరుజల్లులు కురుస్తూనే వున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వగా, రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. పలు గ్రామాల్లో వర్షానికి  ఇళ్లు ఉరుస్తున్నాయి. ఇటీవల తుపాను కారణంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో  మండలవ్యాప్తంగా 220 హెక్టార్లలో  పంటలకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన వరి మొలకలు వస్తుండగా, టమోటా తోటలో నీళ్లు నిలిచి కాయలకు నల్ల మచ్చలు ఏర్పడి రాలి పోతున్నాయి.  


వీధులన్నీ బురదమయం 


ములకలచెరువు: మండలంలో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు వరుసగా వచ్చిన రెండు తుఫాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ మరో తుఫాను కారణంగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ములకలచెరువులో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ బురదమయమయ్యాయి. మార్కెట్‌ యార్డు ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండు ప్రాగణం, వినాయకనగర్‌, పోస్టాఫీసు తదితర వీధులన్నీ రొచ్చుగా మారాయి. దీంతో రాకపోకలు సాగించడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు గ్రామాల రోడ్లు కూడా బురదమయం కావడంతో గ్రామీణులకు అవస్థలు తప్పడం లేదు. 


చిన్నపాటి వర్షం 


పెద్దమండ్యం:  మండలంలో ఆదివారం చిన్నపాటి వర్షం కురిసింది. ముసురుకున్న మబ్బులు కమ్ముకున్న వాతావరణంతో చలి నెలకొంది. చెరువుల మొరవలు, నది ప్రవాహాలు సాధారణ స్థితిలో ప్రవహిస్తున్నాయి. మండల ప్రజలు రాత్రివేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సర్పంచులు కోరారు.

Updated Date - 2021-11-29T06:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising