ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్కరకాలమైనా పరిహారమేదీ?

ABN, First Publish Date - 2021-08-30T06:42:11+05:30

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చి సహకరించాలని అధికారులు కోరారు.

బాధిత రైతుల ఆందోళనతో వికృతమాల సమీపంలో ఆగిన ఎయిర్‌పోర్టు ప్రహరీ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతుల పాట్లు 


ఏర్పేడు, ఆగస్టు 29: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చి సహకరించాలని అధికారులు కోరారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆశతో ఎందరో రైతులు పంటపొలాలను అప్పగించారు. తమ కుటుంబాలకు ఆదరువుగా ఉన్న సాగు భూములిచ్చిన వీరికి.. పుష్కరకాలంగా పరిహారం అందలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తిరుపతికి ఉన్న ప్రాధాన్యం.. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ విస్తరణకు 2009లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి అవసరమైన 800 ఎకరాలను ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలోని 500 మంది రైతుల నుంచి సేకరించారు. ఏర్పేడు మండలం వికృతమాల, గోవిందవరం, పాపానాయుడుపేట, సుబ్బయ్యగుంట, రేణిగుంట మండలం గుత్తివారిపల్లె, వెదళ్లచెరువు గ్రామాల రైతులు ఈ భూములిచ్చారు. 710 ఎకరాలకు అప్పట్లోనే పరిహారం ఇచ్చారు. 90 ఎకరాలకు సంబంధించి 52 మంది రైతులకు పుష్కరకాలం గడచినా పరిహారం అందలేదు. పరిహారం కోసం వీరు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం, ఎయిర్‌పోర్టు వద్ద ధర్నాలు చేశారు. ఆ సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్న అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఈనెల 16న వికృతమాల వద్ద ఎయిర్‌పోర్టు అధికారులు ప్రహరీ పనులు చేపట్టగా.. బాధిత రైతులు అడ్డుకున్నారు. ఇలాగైతే సాయుధ బలగాలను రంగంలోకి దింపాల్సి వస్తుందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సురేష్‌ హెచ్చరించడం వివాదం రేపింది. దీనిపై రైతులు తిరుపతి ఆర్డీవో, ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆదివారం కూడా వికృతమాల రైతులు పరిహారం ఇవ్వాలంటూ పనులు జరుగుతున్న ప్రాంతంలో నిరసన తెలిపారు. 


అర్హులు నష్టపోయారంటూ విమర్శలు.. 

భూమి లభ్యత కంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులకు పట్టాలివ్వడం పరిహారం మంజూరుకు అడ్డంకిగా మారినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే అదనుగా బోగస్‌ పట్టాల వ్యవహారం కూడా తెరపైకి రావడం మరింత ఇబ్బందులు తెస్తోందని అంటున్నారు. దీంతో అర్హులకు అందాల్సిన పరిహారం సొమ్ము పలుకుబడి ఉన్న పెద్దల ఖాతాలకు చేరిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. 


త్వరలో రైతులకు న్యాయం చేస్తాం 

విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం అందని అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఏర్పేడు తహసీల్దారు ఉదయ్‌సంతోష్‌ తెలిపారు. పలుమార్లు జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారన్నారు. రికార్డుల పరిశీలన పూర్తయిందనీ, త్వరలో బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 

Updated Date - 2021-08-30T06:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising