ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2021-10-19T05:52:22+05:30

జగనన్న లేఅవుట్లకు భూములిచ్చి పరిహారం అందని మేర్లపాక దళితులకు న్యాయం చేయాలని రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య డిమాండ్‌ చేశారు.

ఆందోళన చేస్తున్న కూలీల సంఘ నాయకులు, దళితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, అక్టోబరు 18: జగనన్న లేఅవుట్లకు భూములిచ్చి పరిహారం అందని మేర్లపాక దళితులకు న్యాయం చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన బాధిత రైతులతో కలసి తిరుపతిలో ఆర్డీవోను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ పాగాలి రెవెన్యూ లెక్కదాఖలాలో 2008లో మేర్లపాక దళితులకు ప్రభుత్వం ఒకటిన్నర ఎకరా చొప్పున భూములు మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసం దళితుల భూములు తీసుకున్నారనీ, అయితే బాధితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి దళితులకు ఎకరాకు రూ.20లక్షల వంతున వెంటనే సొమ్ము చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వెంకటరత్నం, లోకేష్‌, రమణ, మహేష్‌, నాగరాజు, రమేష్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising