ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విమ్స్‌ ట్రయేజ్‌లో వైద్యసేవలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-05T06:48:00+05:30

కొవిడ్‌ వైద్యం కోసం వచ్చి బెడ్లు దొరకని రోగుల కోసం తాత్కాలిక షెడ్‌లో ఏర్పాటు చేసిన ట్రయేజ్‌లో మంగళవారం బాధితులకు వైద్యసేవలు ప్రారంభించారు.

కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలించిన కలెక్టర్‌ హరినారాయణన్‌


తిరుపతి (వైద్యం), మే 4: కొవిడ్‌ వైద్యం కోసం వచ్చి బెడ్లు దొరకని రోగుల కోసం తాత్కాలిక షెడ్‌లో ఏర్పాటు చేసిన ట్రయేజ్‌లో మంగళవారం బాధితులకు వైద్యసేవలు ప్రారంభించారు. మొత్తం ఆరు పడకలు 12 ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారా ఒకేసారి 12 మందికి వైద్యసేవలు అందించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. జర్మన్‌ టెక్నాలజీతో రూపొందించిన ఈ ట్రయేజ్‌ షెడ్‌ను ఏపీఎంఎస్‌ఐడీసీ సహకారంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్రయేజ్‌ను కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. ఏర్పాట్లు బాగున్నాయని, ట్రయేజ్‌ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం అక్కడి నుంచి పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రి వెనుక భాగంలో కొత్తగా నిర్మిస్తున్న ఎనిమిది టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును పరిశీలించారు. ఈ ట్యాంక్‌ అందుబాటులోకి వస్తే.. అయితే బాధితులకు సరిపడా ఆక్సిజన్‌ అందించవచ్చని అధికారులు వివరించారు. 

Updated Date - 2021-05-05T06:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising