త్వరలో అందుబాటులోకి ఆర్టీపీసీఆర్ ల్యాబ్
ABN, First Publish Date - 2021-10-21T05:30:00+05:30
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ త్వరలో అందు బాటులోకి తీసుకువస్తామని జిల్లా క్షయ నివా రణాఽధికారి రమేష్‌బాబు అన్నారు.
మదనపల్లె క్రైం, అక్టోబరు 21: జిల్లా ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ త్వరలో అందు బాటులోకి తీసుకువస్తామని జిల్లా క్షయ నివా రణాఽధికారి రమేష్‌బాబు అన్నారు. ల్యాబ్‌కు నూతన పరికరాలు, యంత్రాలు, ఇతర సామ గ్రిని ఆయన పరిశీలించారు. పరికరాలను త్వరగా ఏర్పాటు చేయాలని టెక్నీషియన్లను కోరామన్నారు. ల్యాబ్ ప్రారంభమైతే కొవిడ్, క్షయ, ఇతర వ్యాధి నిర్ధరణ పరీక్షలను నిర్వ హించేందుకు సులువుగా ఉంటుంద న్నారు. అనంతరం టీబీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా క్షయ అను మానితులను టీబీ కేంద్రానికి తీసుకొచ్చి గళ్ల పరీక్ష చేయాలన్నారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆంజనేయులు, డాక్టర్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆపరేషన్ ఽథియేటర్‌లో ఆయుఽధపూజ
మెడికల్ సూపరింటెండెంట్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆపరేషన్ ఽథియేటర్‌లో శస్త్రచికి త్స పరికరాలకు ఆయుఽధపూజ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డులు, ఓపీ గదులను అలంకరించారు. సిబ్బందికి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST