ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీఐడీ విచారణ

ABN, First Publish Date - 2021-04-14T06:47:26+05:30

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 13: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2015నుంచి 2018 వరకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణతో పాటు మరమ్మతుల కాంట్రాక్టును టీబీఎస్‌ ఏజెన్సీకి ఇచ్చారు. వెంటిలేటర్‌ నుంచి బీపీ మెషిన్‌ వరకు మొత్తం 178 పరికరాల నిర్వాహణ, మరమ్మతుల బాధ్యత ఈ ఏజెన్సీకి అప్పగించారు. ఇందుకోసం పరికరాల విలువలో 3నుంచి 5శాతం సర్వీసు చార్జీలు వసూలు చేసేవారు. అయితే ఆస్పత్రుల్లో లేని పరికరాలను ఉన్నట్లు, వాటికి సర్వీసులు చేసినట్లు బిల్లులు పెట్టి కోట్లాది రూపాయల క్లయిమ్‌ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పలు రికార్డులను తనిఖీ చేశారు. ఏజెన్సీ పెట్టిన బిల్లులోని అంశాలు, ఆస్పత్రిలోని పరికరాలు, వాటి విలువ, సర్వీసులకు అయ్యే ఖర్చులను పరిశీలించారు. 

Updated Date - 2021-04-14T06:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising