ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తురు జిల్లా: జలదిగ్బంధంలో చిక్కుకున్న 540 గ్రామాలు

ABN, First Publish Date - 2021-11-19T15:52:21+05:30

చిత్తూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు 540 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు 540 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 700 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,300 గ్రామాల్లో అంథకారం అలుముకుంది. 170 చెరువులకు గండ్లు పడ్డాయి. బంగారుపాలెం మండలం, టేకుమందకు వెళ్లే దారి బలిజపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయిన నలుగురు మహిళల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేశారు. దిగువన ఉన్న శివాలయం నీట మునిగింది. ప్రహరీ గోడ కూలిపోయింది. గంగాధర్ నెల్లూరు మండలం సమీపంలోని నీవా నది బ్రిడ్జిపైకి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది.


పెనుమూరు మండలం, బలిజపల్లి రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వాల్మీకిపురం మండలం, చింతపర్తి వద్ద బాహుదానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుంటి గంగమ్మ ఆలయం  నీటమునిగింది. పెద్దతిప్ప సముద్రం మండలంలో ఉధృతంగా  పెద్దేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో దిగువ పల్లికి రాకపోకలు స్తంభించాయి. పాల సముద్రం మండలం, బలిజ కండ్రిగ గ్రామం వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది. 

Updated Date - 2021-11-19T15:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising