ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీ రికార్డుల తనిఖీలు ముమ్మరం

ABN, First Publish Date - 2021-08-24T07:26:27+05:30

చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధి హామీ రికార్డులను డ్వామా అధికారులు తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఆగస్టు 23: జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో సోమవారం కూడా ఉపాధి హామీ రికార్డులను డ్వామా అధికారులు తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో జరిగిన పనులను రికార్డులతో సరిపోల్చుకునే సమయం లేకపోవడంతో కార్యాలయాల్లో వున్న రికార్డులైనా సక్రమంగా వున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించారు. డ్వామాకు చెందిన రెగ్యులర్‌, వాటర్‌ షెడ్‌ అడిషనల్‌ పీడీలు, క్లస్టర్‌ ఏపీడీలు, ఎస్సార్పీలకు కేటాయించిన మండలాల్లో సోమవారం ముమ్మరంగా పర్యటించారు. కొన్ని మండలాల్లో రికార్డులు సరిదిద్దడం ఇంకా పూర్తికాలేదని అధికారులు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బృందం రాక మునుపే ఈ రికార్డులను రాష్ట్ర బృందాలు పరిశీలించాలని టీములను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకూ ఐదుగురితో ఏర్పడ్డ ఈ టీములు ఎంపిక చేసిన మండలాల్లో రికార్డులను పరిశీలించాల్సి వుంది.అసలు కేంద్ర బృందం పర్యటించాల్సిన మండలాలు ఇంత వరకూ ఖరారు కాలేదు. ప్రస్తుతం జిల్లా అధికారులు ఎంపిక చేసిన 38 మండలాల్లో రికార్డులన్నీ మెరుగ్గా వున్న మండలాలను కేంద్ర బృందం పర్యటన కోసం ఎంపిక చేసేందుకు జిల్లాస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్ర కమిషనరు కార్యాలయం నుంచి వచ్చే టీముల పరిశీలన కోసం తయారు చేసిన రెండు రకాల చెక్‌ లిస్టులకు అనువుగా వివరాలను సిద్ధం చేసేందుకు రెండు రోజులే గడువుండటంతో అధికారులపై వత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర బృందం మూడు రోజుల్లో మూడు మండలాల్లోని ఆరు పంచాయతీల్లో పర్యటించాల్సి వుంది. ఒక్కో పంచాయతీలో కనీసం రెండు పనులను ఈ బృందం పరిశీలించాల్సి వుంది.అలాగే అన్ని రకాల రికార్డులను తనిఖీ చేయాల్సి వుంది. ఎక్కడైనా లోటుపాట్లను గుర్తిస్తే అందుకు బాధ్యులయిన వారిని గుర్తించి వెంటనే డ్వామా పీడీ, గ్రామీణాభివృద్ధి కమిషనరు దృష్టికి తీసుకెళ్లాల్సి వుంటుంది. ఎంచుకున్న ప్రతి పనినీ నిశితంగా పరిశీలించి రాష్ట్ర బృందం అభిప్రాయలను కూడా నమోదు చేయాలని సూచించారు. ఇదంతా పక్కాగా జరిగేందుకు ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలని రాష్ట్ర బృందాలకు జాగ్రత్తలు చెప్పారు. కేంద్ర బృందం పరిశీలించనున్న అన్ని రకాల అంశాల గురించి వివిధ కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-08-24T07:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising