ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధిహామీ పనులను తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN, First Publish Date - 2021-09-29T06:29:34+05:30

గంగాధరనెల్లూరు పంచాయతీలో జరిగిన ఉపాధిహామీ పనులను కేంద్ర బృంద అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు.

ఏపీఐఐసీ స్థలంలో నాటిన మొక్కల వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృంద సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 28: గంగాధరనెల్లూరు పంచాయతీలో జరిగిన ఉపాధిహామీ పనులను కేంద్ర బృంద అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ప్రత్యేకఅధికారి దినే్‌షకుమార్‌ పాన్‌వార్‌ నేతృత్వంలో జి. శ్రీనివాసులురెడ్డి, జి.రాజేష్‌, వి.నీరజ కలిసి 2018-19, 2020-21 సంవత్సరాలకుగాను గంగాధరనెల్లూరు మండలానికి సంబంధించి జరిగిన పనుల రికార్డులను తనిఖీ చేశారు.  కేంద్ర బృంద అధికారులను ఎంపీడీవో శ్రీదేవి కలిసి మండలంలో రెండేళ్ళలో  కూలీలు చేసిన పనులు, వారు పొందిన లబ్ధి ఇతర వివరాల గురించి తెలియజేశారు.  అనంతరం  కేంద్ర బృందం గంగాధరనెల్లూరు పంచాయతీలో ఏపీఐఐసీకి కేటాయించిన భూమిలో రోడ్డుకిరువైపుల నాటిన మొక్కలు, అలాగే అక్కగార్ల(కనికలమ్మ)గుట్టలో కందకాల పనులు పరిశీలించారు.  రోజుకు కూలీ ఎంతగిట్టుబాబు అవుతోంది, బిల్లులు ఎన్నిరోజుల్లో జమ చేస్తున్నారనే వివరాలను  కూలీలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, జరిగిన పనులపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ పీడీ రామాంజనేయరెడ్డి, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం, జిల్లా ఫైనాన్స్‌ మేనేజర్‌ మధు, ఉపాధిహామీ ఏపీవో మృత్యుంజయరావు,  ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ సతీష్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు గోపి, గుణశేఖర్‌, మురుగేషన్‌, మోనిక, ఫీల్డ్‌అసిస్టెంట్‌ నాగరాజు, పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising