ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగి వెలుగులు

ABN, First Publish Date - 2021-01-14T06:05:08+05:30

గతేడాది మనమనుభవించిన కరోనా కష్టాలను భగభగ మండించి బూడిద చేస్తూ భోగి పండుగ వెళ్లిపోయింది. తెలి మంచు కౌగిట్లో ఊరూరూ.. బుధవారంనాటి భోగి వెలుగుల్లో వెలిగిపోయింది. ఆ వెలుగులు తెచ్చిన జిలుగుల్లో చైతన్యం తెచ్చుకుని పెద్ద పండుగ సంబరాలకూ సిద్ధమైపోయింది

తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు భోగిమంటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గతేడాది మనమనుభవించిన కరోనా కష్టాలను భగభగ మండించి బూడిద చేస్తూ భోగి పండుగ వెళ్లిపోయింది. తెలి మంచు కౌగిట్లో ఊరూరూ.. బుధవారంనాటి భోగి వెలుగుల్లో వెలిగిపోయింది. ఆ వెలుగులు తెచ్చిన జిలుగుల్లో చైతన్యం తెచ్చుకుని పెద్ద పండుగ సంబరాలకూ సిద్ధమైపోయింది. భోగి పర్వాన్ని ముగించుకుని పట్టణం తరలొచ్చిన పల్లె.. పండగ కొనుగోళ్లు చకచకా కానిచ్చేసింది. గురువారం మకర సంక్రాంతి, ఆపైన శుక్రవారంనాడు కనుమ.పొలాలనుంచి ఇళ్లకు తరలొచ్చే పాడి పంటల పండుగొకటైతే.. మరొకటి వ్యావసాయిక పల్లెజీవనంతో మమేకమై మన మట్టి మనుషుల కష్టనష్టాలకు సాక్షీభూతంగా నిలిచే పశు సంపదను గౌరవించుకునే పర్వం.అది తిరుపతి నగరం కావచ్చు.. కుప్పంలాంటి మారుమూల చిరు పట్టణమూ అవ్వొచ్చు. పండుగ ముందు రోజు పూజలకు అవసరమైన సంబరాల కొనుగోళ్లతో బజార్లన్నీ బిజీగా మారిపోయాయి.



Updated Date - 2021-01-14T06:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising