ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీకాం ప్రశ్నాపత్రం లీక్‌ వాస్తవమే

ABN, First Publish Date - 2021-10-05T06:27:24+05:30

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో సంచలనం రేకెత్తించిన ప్రశ్నాపత్రం లీక్‌ నిజమేనని తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 4: ఎస్వీయూనివర్సిటీ పరిధిలో సంచలనం రేకెత్తించిన ప్రశ్నాపత్రం లీక్‌ నిజమేనని తేలింది. గత నెల 29వ తేదీన చేపట్టిన బీకాం ఫైనలియర్‌ అకౌంట్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ పరీక్ష  ప్రశ్నాపత్రం వాట్స్‌పలో కొన్ని గంటలముందే హల్‌ చల్‌ చేసింది.పరీక్ష నిర్వహించాక ప్రశ్నాపత్రం లీక్‌పై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.విచారణ చేపట్టిన కమిటీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని తేల్చింది. గత నెల 29 వ తేదీన మధ్యాహ్నం 2 నుంచీ 5 గంటల వరకూ నిర్వహించిన బీకాం ఫైనలియర్‌ అకౌంట్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ (ప్రశ్నాపత్రం కోడ్‌: 1-6-101బి) పరీక్షను రద్దు చేశారు. సమస్యకు కేంద్రమైన మదనపల్లె డివిజన్‌లోని 12 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేశారు. రద్దయిన ఈ పరీక్షను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 నుంచీ 5 గంటల వరకూ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికైనా పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని సంబంధిత పరీక్షా కేంద్రాల అధికారులకు వీసీ ప్రొఫెసర్‌ కె. రాజారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సీఈ దామ్లా నాయక్‌ సోమవారం వెలువరించారు. అయితే, ఈ సంఘటనకు బాధ్యులెవరనే విషయాన్ని అధికారులు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి ఉదాసీనత వల్ల భవిష్యత్తులోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-10-05T06:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising