ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధారం.. అవసరంలేకుండా ఎవరినీ నిర్బంధించొద్దు

ABN, First Publish Date - 2021-10-23T07:11:13+05:30

సరైన ఆధారం, అవసరం లేకుండా ఎవరినీ స్టేషన్లలో నిర్బంధించొద్దని అధికారులకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు.

ఎస్పీ నుంచి శోభిత జ్ఞాపికలను అందుకుంటున్న ఏఎస్పీ సుప్రజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు అధికారులకు అర్బన్‌ ఎస్పీ సూచన 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 22: సరైన ఆధారం, అవసరం లేకుండా ఎవరినీ స్టేషన్లలో నిర్బంధించొద్దని అధికారులకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. అధికారం ఉందికదాని అతిక్రమించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్బన్‌ జిల్లాలో నేర పరిస్థితులపై శుక్రవారం ఆయన ఎస్వీయూ సెన్‌ట్‌హాల్లో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. నేర సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించాలని, మేధస్సుతో ఆలోచించి సాంకేతికతను జోడిస్తే ఎటువంటి సమస్యైనా పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. మహిళలు, పిల్లలు, మిస్సింగ్‌ కేసులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బహిరంగంగా మద్యం, మత్తుపదార్థాలను తీసుకోవడం, పేకాటపై నిఘాపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరీఫుల్లా, మునిరామయ్య, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

జ్ఞాపికలు ప్రదానం: వివిధ కేసులను పరిష్కరించడంలో కష్టపడి పనిచేసిన అధికారులు, సిబ్బందికి శోభిత, శోధన, స్పందన జ్ఞాపికలను ఎస్పీ అందజేశారు. 

శోభిత: అదనపు ఎస్పీ సుప్రజ, దిశ డీఎస్పీ ఆర్‌. రామరాజు, తిరుచానూరు సీఐ ఎం.సుధాకర్‌రెడ్డి 

శోధన: తొట్టంబేడు సీఐ ఆరోహణరావు, బి.రాఘవేంద్ర, సి.గంగకుమార్‌, ఎస్‌.యుగంధర్‌, ఎ.వాసు, భక్తవత్సలం, వి.రవిచంద్ర, కె.హేమంత్‌కుమార్‌, జి.అరుణ్‌కుమార్‌, ఎం.జగదీష్‌, వి.మారిముత్తు

స్పందన: ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కె.వెంకటేశ్వర్లునాయుడు, కె.వెంకటమునిరాజు, టి.ప్రభాకర్‌, అలిపిరి స్టేషన్‌ సిబ్బంది వెంకటచలపతి, జె.చిరంజీవి, జి.శివకుమార్‌  

Updated Date - 2021-10-23T07:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising