విరూపాక్షపురంలో ఆయుర్వేద వైద్యశాలల మూత
ABN, First Publish Date - 2021-06-02T06:09:46+05:30
కొవిడ్ ఉధ్రుతితో విరూపాక్షపురం ఆయుర్వేద వైద్యశాలలను తాత్కాలికంగా మూసి వేయిస్తున్నట్లు తహసీల్దార్ సీతారామ్ పేర్కొన్నారు.
బైరెడ్డిపల్లె, జూన్ 1: కొవిడ్ ఉధ్రుతితో ఆయుర్వేద వైద్యశాలలను తాత్కాలికంగా మూసి వేయిస్తున్నట్లు తహసీల్దార్ సీతారామ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విరూపాక్షపురంలో ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ, ఎస్‌ఐ మునిస్వామి, ఆయుర్వేద వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ.. పక్షవాతం మందు కోసం వివిధప్రాంతాల రోగులు ఇక్కడికి వస్తుంటారని గుర్తుచేశారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో బుధవారం నుంచి వైద్యశాలల మూసి వేతకు ఆయుర్వేద వైద్యులు అంగీకరించారు. మళ్లీ ఆస్పత్రులను పునఃప్రారంభించే తేదీని త్వరలో వెల్లడిస్తామనీ, అప్పటి వరకు దూరప్రాంత రోగులు విరూపాక్షపురానికి రావద్దని సూచించారు.
Updated Date - 2021-06-02T06:09:46+05:30 IST