ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కంటి ఆలయంలో హారతితట్టకు మంగళం

ABN, First Publish Date - 2021-07-26T05:57:01+05:30

ముక్కంటి ఆలయంలో హారతితట్టకు మంగళం పాడుతూ ఈవో చర్యలు తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కానుకలు తీసుకోరాదని ఈవో ఆదేశం

ఎమ్మెల్యే సూచనతో ఎట్టకేలకు చర్యలు


శ్రీకాళహస్తి(చిత్తూరు): శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇకపై హారతితట్టలు కన్పించవు. అర్చకులు భక్తుల నుంచి కానుకలు కూడా స్వీకరించరు. ఎవరైనా సొమ్ము ఇచ్చినా ఆలయ హుండీలో వేయాల్సిందే. ముక్కంటి ఆలయంలో హారతితట్టలకు మంగళం పాడుతూ ఈవో పెద్దిరాజు నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ నిర్ణయం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న హారతితట్ట కోసం స్వామి గర్భాలయంలో ఇద్దరు అర్చకులు గొడవ పడ్డారు. దీంతో ఇద్దరినీ రెండునెలల పాటు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. విచారణ అధికారి శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసినా.... పలు కారణాలతో ఇద్దరు అర్చకులను ఈవో మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. అయితే కోరిన చోట విధులు కేటాయించడం విమర్శలకు దారితీసింది.


ఈ వివాదాస్పద నిర్ణయంపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు ప్రచురితయ్యాయి. స్పందించిన ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న హారతితట్టలకు మంగళం పాడాలని ఆదేశించడంతో, ఆ మేరకు ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ ఆలయాల్లో మాత్రమే హారతి ఇస్తారు. అక్కడ పనిచేసే అర్చకులు భక్తుల నుంచి కానుకలు స్వీకరించరు. ఎవరైనా హారతి తట్టలో కానుకలు వేసినా తప్పనిసరిగా హుండీలో వేయాల్సి ఉంటుంది. ఇక ఆలయం లోపల, ప్రాంగణంలోని పరివార దేవతల వద్ద హారతితట్టలు ఉంచకూడదు. అక్కడా హారతి తట్టతో ఎవరైనా అర్చకులు కన్పిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో ఉత్తర్వులిచ్చారు. 


రాహు-కేతు పూజల్లోనూ వసూళ్లకు బ్రేక్‌

ముక్కంటి ఆలయంలో జరిగే రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రముఖులు, భక్తులు వస్తుంటారు. రూ.500 నుంచి రూ.5వేల వరకు ఐదురకాల ధరల్లో ఇక్కడ టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ పూజలకు హాజరయ్యే భక్తుల నుంచి అర్చకులు రూ.116 నుంచి రూ.1,116 వరకు వసూలు చేస్తుంటారు. అడిగి మరీ కానుకలు తీసుకోవడం అలవాటుగా మార్చుకోవడంపై కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. ఇందులో పలువురు అధికారులకు కూడా వాటా అందుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాహు-కేతు పూజలకు హాజరయ్యే భక్తుల నుంచి అర్చకులు కానుకలు తీసుకోకుండా కట్టడి చేయాలని ఈవో పెద్దిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు.. భక్తులు స్వచ్ఛందంగా కానుకలు సమర్పించినా, అర్చకులు తప్పనిసరిగా ఆ సొమ్మును హుండీలో వేయాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో తేల్చిచెప్పారు. మొత్తం మీద ఇటు హారతితట్టలకు, అటు రాహు-కేతు మండపాల్లో అర్చకులు కానుకలు స్వీకరించకుండా ఈవో నిర్ణయం తీసుకోవడంపై ముక్కంటి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-26T05:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising