ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజీ ఇంటర్‌ సెట్‌ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానం

ABN, First Publish Date - 2021-06-18T05:41:51+05:30

జిల్లాలోని 11 బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2021 -2022 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే బీజీ ఇంటర్‌ సెట్‌ అర్హత పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి/కల్లూరు, జూన్‌ 17: జిల్లాలోని 11 బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2021 -2022 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే బీజీ ఇంటర్‌ సెట్‌ అర్హత పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. జూన్‌ 17వ తేదీ నుంచి జూలై 7 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షల తేదీలు మాత్రం తరువాత ప్రకటిస్తారు. జిల్లాలో బాలుర కోసం రామకుప్పం, బి.కొత్తకోటల్లోనూ, బాలికల కోసం శ్రీకాళహస్తి, చిత్తూరు, పీలేరు, తంబళ్లపల్లె (బురకాయలకోట), పలమనేరు, సత్యవేడు, పుత్తూరు (గోపాలకృష్ణాపురం), మదనపల్లె, కుప్పంలో సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలున్నాయి. సొంత జిల్లాలోని కళాశాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి తెలుగు మీడియం విద్యార్థులతో పాటు ప్రస్తుతం పది   పరీక్షలకు హాజరవుతున్న వారూ అర్హులే. వయసు ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లలోగా ఉండాలి. వార్షికాదాయం రూ. లక్ష లోగా ఉండాలి. సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలకు చిత్తూరు జిల్లా కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ను 79955 62127 నంబరులో సంప్రదించవచ్చు. 

Updated Date - 2021-06-18T05:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising