ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.వెయ్యి కోతతో అమ్మ ఒడి సొమ్ము జమ

ABN, First Publish Date - 2021-01-12T06:58:54+05:30

రూ.వెయ్యి కోతతో అమ్మ ఒడి సొమ్ము జమ చేశారు.

అమ్మఒడి చెక్కును అందజేస్తున్న డిప్యూటీ సీఎం, కలెక్టర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 11: అమ్మఒడి రెండో విడతలో జిల్లాలో 3,51,330మంది తల్లులకు లబ్ధి చేకూరింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 6,77,524 మంది విద్యార్థులు చదువుతుండగా 5,59,289మందిని అమ్మఒడికి అర్హులుగా గుర్తించారు. ఇందుకు అవసరమైన రూ.527 కోట్లలో తల్లుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు రూ.14 వేలు చొప్పున రూ.491.86 కోట్ల మొత్తాన్ని జమ చేశారు. తలా వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం రూ.35.13 కోట్లను డిస్ట్రిక్‌ టాయిటెల్‌ మేనేజ్మెంట్‌ ఫండ్‌ (డీటీఎంఎఫ్‌)కు మళ్లించారు.కలెక్టర్‌ భరత్‌గుప్తా అధ్యక్షతన అమ్మఒడి రెండో విడత జిల్లా స్థాయి కార్యక్రమం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే సమాజాన్ని మార్చగలమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,జేసీ వీరబ్రహ్మం, చుడా ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, డీఈవో నరసింహారెడ్డి, సమగ్రశిక్ష ఏసీపీ వెంకటరమణారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్‌, జేసీ సీరియస్‌

చిత్తూరులో జరిగిన అమ్మఒడి కార్యక్రమం అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంపై కలెక్టర్‌కు సీరియస్‌ అయ్యారు.సీఎం ప్రసంగ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో లేకపోవడం,అందులోనూ  తల్లుల సంఖ్య చాల తక్కువగా ఉండడం ఉన్నతాధికారులను అసహనానికి గురిచేశాయి. సభలో ప్రసంగాల సమయంలో ప్రోటోకాల్‌ పాటించకపోవడం,సభ ముగిసే సమయానికి హాలు ఖాళీగా కనిపించడం వంటి పరిణామాలను కలెక్టర్‌తో పాటు జేసీ వీరబ్రహ్మం సీరియస్‌గా తీసుకున్నారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని డీఈవో నరసింహారెడ్డిని ఆదేశించారు.సెక్టోరియల్‌ అధికారులు వేదికపై వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సెక్టోరియల్స్‌పై జేసీ తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2021-01-12T06:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising