ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవోదయ విద్యాలయంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

ABN, First Publish Date - 2021-12-06T05:54:27+05:30

మదనపల్లె మండలంలోని వలసపల్లె సమీపంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 1988-94లో విద్యనభ్యసించిన రెండోబ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఒకచోట చేరడంతో సందడిగా మారింది.

ప్రిన్సిపాల్‌ కాశయ్యకు వాహన తాళాలను అప్పగిస్తున్న దాత కల్యాణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, డిసెంబరు 5: మండలంలోని వలసపల్లె సమీపంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 1988-94లో విద్యనభ్యసించిన రెండోబ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఒకచోట చేరడంతో  సందడిగా మారింది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి చదువు, గురువుల విద్యాబోధన, చేసిన అల్లరి పనులను గుర్తుచేసుకుంటూ బాల్యంలోకి వెళ్లిపోయారు.  ఉదయం నుంచి సాయంత్ర వరకు ఆనందంగా గడిపారు. పీలేరుకు చెందిన జి.కల్యాణ్‌రెడ్డి రూ.13 లక్షల వ్యాన్‌ను విద్యాలయానికి వితరణ చేశాడు.  ప్రిన్సిపాల్‌ కాశయ్య మాట్లాడుతూ... నవోదయ విద్యాలయంలో చదివిన విద్యార్థులు ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. పుట్టిన ఊరు, చదివిన పాఠశాలను మరవకుండా తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను ఎప్పటికీ మరువకూడదన్నారు.  అనంతరం తమకు విద్యనేర్పిన గురువులను సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T05:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising