ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం

ABN, First Publish Date - 2021-08-11T16:51:57+05:30

తిరుపతి: విద్యార్థుల ఉన్నత చదువులకు, పరిశోధనలకు అవసరమైన నూతన సాంకేతికతను పరిచయడం చేసి వారిలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచేలా అమెరికా, ఐరోపా దేశాల్లోని శాస్త్రీయ పరిశోధన విధానాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్చువల్‌ విధానంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 


తిరుపతి: విద్యార్థుల ఉన్నత చదువులకు, పరిశోధనలకు అవసరమైన నూతన సాంకేతికతను పరిచయం చేసి, వారిలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచేలా చర్యలు చేపట్టామని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ 50వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచి చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొని ప్రసంగించారు. గవర్నర్‌కు వర్శిటీ ప్రతినిధి డాక్టర్‌ చెంగారెడ్డి ద్వారా స్నాతకోత్సవ జ్ఞాపికను అందజేశారు. అనంతరం వీసీ విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని 75వ్యవసాయ విశ్వవిద్యాయాల్లో మన వర్శిటీ 2019లో 13వ స్థానం సాధించిందని, దీన్ని మరింత మెరుగుపరుచుకుని 10స్థానాల్లోపు తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ గిరిధర్‌కృష్ణ, డీన్లు, అధికారులు పాల్గొన్నారు.


2016-17 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన 796 మందికి డిగ్రీలు అందజేశారు. కొవిడ్‌ నేపథ్యంలో 150మందికే అనుమతి ఇచ్చారు. దీంతో 19మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, 16మందికి పీజీ.. ఆరుగురికి యూజీ బంగారు పతకాలు, 16మందికి ఎండోమెంట్‌ అవార్డులు, హానర్స్‌ను వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి నేరుగా అందజేశారు. ఈసీ సభ్యులు కళావతి, టీవీ మురళీనాథరెడ్డి, డాక్టర్‌ పి.వెంకటరామమునిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ గిరిధర్‌కృష్ణ, వర్సిటీ డీన్లు డాక్టర్‌ ప్రతా్‌పకుమార్‌రెడ్డి, డాక్టర్‌ ఎల్లారెడ్డి, డాక్టర్‌ బాలగురవయ్య, అధికారులు, ఎస్వీవ్యవసాయ కళాశాల ఏడీ డాక్టర్‌ రవీంద్రనాథరెడ్డి, ఏడీఆర్‌ డాక్టర్‌ ప్రశాంతి, డాక్టర్‌ ఏఆర్‌కే రావు, డాక్టర్‌ ఎస్వీ ప్రసాద్‌,  శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T16:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising