ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరివెన్నెలకు ఘన నివాళి

ABN, First Publish Date - 2021-12-07T06:40:36+05:30

తెలుగు సాహిత్యం, సినిమా పాటకు కొత్త సొబగులు అద్దిన గొప్పవ్యక్తి సిరివెన్నెల అని ప్రముఖ సాహితీవేత్త చీకోలు సుందరయ్య కొనియాడారు.

సిరివెన్నెలకు నివాళులర్పిస్తున్న రచయితలు, సాహితీవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, డిసెంబరు 6: తెలుగు సాహిత్యం, సినిమా పాటకు కొత్త సొబగులు అద్దిన గొప్పవ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని ప్రముఖ సాహితీవేత్త చీకోలు సుందరయ్య కొనియాడారు. పట్టణ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం, ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సభ్యులు సిరివెన్నెలకు నివాళులర్పించారు. సుందరయ్య మాట్లాడుతూ... నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటూ ప్రజల్ని చైతన్య పరిచే గీతాలని సిరివెన్నెల రచించినట్లు గుర్తుచేశారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు సాకం నాగరాజు మాట్లాడుతూ తెలుగు సినిమా రంగం ఓ సాహితీ దిగ్గజాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన ఆయన మనం పాడుకునే పాటల్లో చిరస్మరణీయుడిగా మిగిలారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రముఖులు, సాహితీవేత్తలు బొందు రామచంద్రారెడ్డి, లగడపాటి భాస్కర్‌, పేరూరు బాలసుబ్రహ్మణ్యం, యువశ్రీ మురళి, గురునాథం, ఒబ్బు దేవీప్రసాద్‌, కృష్ణయ్య, భాస్కర్‌, రవీంద్ర, గోవిందయ్య, మంగీలాల్‌, రాజేశ్వరి, సరోజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising