ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుకెళ్లిపోతోంది!

ABN, First Publish Date - 2021-09-29T06:33:22+05:30

ట్రాక్టర్లతో ఇసుక తోడేసి పొలాల్లో డంపింగ్‌ చేసినా పట్టించుకునే నాథుడే లేడు. సోమల మండలం నుంచి ఇసుక భారీస్థాయిలో బయటి ప్రాంతాలకు తరలిపోతోంది.

సీతమ్మ చెరువు వంకలో ఇసుక నింపుతున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమల వంకల నుంచి తరలించి రామకృష్ణాపురం పొలాల్లో నిల్వ 

ట్రాక్టరు లోడు రూ.4వేల చొప్పున బయటి ప్రాంతాలకు తరలింపు 


పుంగనూరు, సెప్టెంబరు 28:  ట్రాక్టర్లతో ఇసుక తోడేసి పొలాల్లో డంపింగ్‌ చేసినా పట్టించుకునే నాథుడే లేడు.  సోమల మండలం నుంచి ఇసుక భారీస్థాయిలో బయటి ప్రాంతాలకు తరలిపోతోంది.ఆవులపల్లె సమీ పంలోని సీతమ్మ చెరువు వంక ప్రాంతంలోని చెరువు పొద - బైరెడ్డిపల్లె మధ్య గల వంకలో ఎక్సకవేటర్లతో ట్రాక్టర్లకు ఇసుక నింపి తరలిస్తున్నారు. రామకృష్ణాపురం ప్రాంతంలోని పొలాల్లో వందల లోడ్ల ఇసుకను నిల్వ చేసి సోమలతో పాటు చౌడేపల్లె, కలికిరి ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు.అడిగితే జగనన్న కాలనీల నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలని చెబుతూ ఇష్టారాజ్యంగా ఇసుక తరలించి లోడు రూ.4వేల చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు రాత్రి వేళల్లో లారీల ద్వారా బయటప్రాంతాలకు తరలిస్తున్నారు.అధికారుల వద్ద వైసీపీ బడా నేతల పేర్లు చెప్పుకుంటూ ఇసుక వ్యాపారాలను నిర్విరామంగా సాగిస్తున్నారు.

Updated Date - 2021-09-29T06:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising