ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేకుంటే రూ.100 జరిమానా

ABN, First Publish Date - 2021-04-21T06:34:11+05:30

మాస్క్‌ ధరించకుంటే రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఏప్రిల్‌ 20: మాస్క్‌ ధరించకుంటే రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది. ఇప్పటి వరకూ స్థానిక అధికారుల నిర్ణయం మేరకు రూ.50 నుంచి 200 వరకూ విధించే రకరకాల జరిమానాలకు ప్రభుత్వం చరమగీతం పలికింది. ప్రభుత్వమే రూ.వంద జరిమానా విధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వీటి బాధ్యతను డ్యూటీలోని పోలీసులందరికీ అప్పగించారు. అమలు బాధ్యతను కలెక్టరుకు ఇచ్చారు. నోరు, ముక్కు పూర్తిగా మాస్క్‌తో కప్పి ఉండాలని స్పష్టంచేసింది. దుకాణాలు తదితర గుమికూడే ప్రదేశాల్లో ప్రజలచేత మాస్క్‌ ధరింపజేసే బాధ్యత నిర్వాహకులదేనని తేల్చి చెప్పింది. అలాగే, బహిరంగ ప్రదేశాలతోపాటు జనం గుమికూడే అవకాశమున్న చోట తప్పనిసరిగా ఐదడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. కల్యాణ మండపాలు, థియేటర్లలాంటి కూర్చోవడానికి సీట్లున్న చోట సీటు మార్చి సీటు ఖాళీగా ఉంచాలని తెలిపింది. ఇక్కడ కూడా శానిటైజర్‌ సమకూర్చడం, మాస్క్‌ ధరించడం తప్పని సరిగా పేర్కొంది. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌, ఐదడుగుల భౌతిక దూరం కూడా పాటించాలని సూచించింది. స్విమ్మింగ్‌ పూల్స్‌ను తక్షణం మూసేయాలని పేర్కొంది. ఇవన్నీ తక్షణం అమల్లోకి తీసుకురావాలని కలెక్టరును ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2021-04-21T06:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising