ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 14.56 కోట్లతో 91 డిజిటల్‌ లైబ్రరీలు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

ABN, First Publish Date - 2021-08-09T05:30:00+05:30

పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.14.56కోట్లతో 91 డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, ఆగస్టు 9: పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.14.56కోట్లతో 91 డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీలేరులో 14, కేవీపల్లెలో 17, కలకడలో 15, గుర్రంకొండలో 15, వాల్మీకిపురంలో 16, కలికిరిలో 14 చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఒక్కొక్క డిజిటల్‌ లైబ్రరీకి రూ.16లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రెవెన్యూ అధికారులు స్థల సేకరణ ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే ల్రైబరీల నిర్మాణ పనులు ప్రారంభమవుతా యన్నారు. అలాగే పీలేరులో జడ్పీ విశ్రాంతి భవనం నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరైందన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత విశ్రాంతి భవనాన్ని తొలగించి అదే ప్రాంతంలో నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-08-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising