ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటేద్దామన్న ఉత్సాహం

ABN, First Publish Date - 2021-01-17T05:04:36+05:30

చిత్తూరు జిల్లాలో కొత్తగా 24,573 మంది యువత ఓటరు జాబితాలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 16: అర్హులు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలి. మంచి నాయకులను ఎన్నుకోవడంలో ఓటే వజ్రాయుధమంటూ అధికార యంత్రాంగం ప్రచారం చేసింది. ఆ మేరకు గత ఏడాది నవంబరు, డిసెంబరులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించింది. బీఎల్వోలు అందుబాటులో ఉండి 18ఏళ్లు నిండిన యువత ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మరోవైపు నియోజకవర్గాల వారీ అడ్రసు తదితర మార్పుచేర్పులకూ అవకాశమిచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా అనేక మంది ముందుకొచ్చి దరఖాస్తులను సమర్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసిన తుది ఫొటో ఓటరు జాబితా మేరకు జిల్లాలో ఓటర్ల సంఖ్య 32,69,677గా ఉంది. వీరిలో కొత్తగా నమోదైన యువ ఓటర్ల సంఖ్య 24,573గా ఉంది. 


సర్వీస్‌ ఓటర్లు 5098 మంది

  త్రివిధ(డిఫెన్స్‌, ఆర్మ్‌డ్‌, ఫారిన్‌ సర్వీస్‌) దళాల్లో పనిచేస్తున్న జిల్లావాసులు, వారి కుటుంబసభ్యులను సర్వీసు ఓటర్లుగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్‌ ఓటుహక్కు కల్పిస్తోంది. శుక్రవారం విడుదల చేసిన తుది ఫొటో ఓటరు జాబితా మేరకు.. జిల్లాలో సర్వీస్‌ ఓటర్ల సంఖ్య 5098గా ఉంది. వీరిలో డిఫెన్స్‌ సర్వీ్‌సలో ఉన్న వారు 5096 మంది, ఫారిన్‌ సర్వీ్‌సలో ఇద్దరు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 5024 మంది, మహిళలు 74 మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా... పూతలపట్టులో 1130 మంది, చిత్తూరులో 943, తంబళ్లపల్లెలో 170, పీలేరులో 440, మదనపల్లెలో 175, పుంగనూరులో 406, చంద్రగిరిలో 443, తిరుపతిలో 99, శ్రీకాళహస్తిలో 99, సత్యవేడులో 89, నగరిలో 152, గంగాధరనెల్లూరులో 515, పలమనేరులో 240, కుప్పంలో 197 మంది ఉన్నారు. 

Updated Date - 2021-01-17T05:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising