ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1.29 లక్షల గుట్కా ప్యాకెట్లు, కర్ణాటక మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-07-25T07:16:40+05:30

గుట్కా ప్యాకెట్లను దుకాణాలకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని తిరుపతి ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లు, కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి వివరాలను తెలియజేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితుడి అరెస్టు


తిరుపతి(నేరవిభాగం), జూలై 24: గుట్కా ప్యాకెట్లను దుకాణాలకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని తిరుపతి ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లు, కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జీవకోన రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన నారాయణశెట్టి కుమారుడు సుబ్రహ్మణ్యంశెట్టి (40) నిషేధిత పొగాకు ఉత్పత్తులను కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి నగరంలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కూడా ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పెద్ద బండిళ్లను దించుకుని ఉండగా సీఐకి అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అందులో నిషేధిత పొగాకు ఉత్పత్తులు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతడి వద్ద నుంచి ఎనిమిది కర్ణాటక మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిషేధిత, మత్తుపదార్థాల విలువ సుమారు రూ.1.29 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-25T07:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising