ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సంస్థ నివేదికలో వైసీపీనేతలే ముందంజ: చినరాజప్ప

ABN, First Publish Date - 2021-08-24T23:42:34+05:30

క్రిమినల్స్ ప్రజాప్రతినిధులుగా మారడంపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో వైసీపీ నేతలే ముందున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి: క్రిమినల్స్ ప్రజాప్రతినిధులుగా మారడంపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో వైసీపీ నేతలే ముందున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ  ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగచేతికి తాళాలిచ్చినట్టు జగన్మోహన్‌రెడ్డి అనే నేరస్తుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని మండిపడ్డారు.జగన్‌ని ఆదర్శంగా తీసుకొని  వైసీపీ నేతలు కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రం అవినీతిలో తొలిస్థానంలో, అభివృద్ధిలో ఆఖరిస్థానంలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  నిర్వాకాలతో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టుబోనుల్లో నిలబడుతున్నారని దుయ్యబట్టారు. దొంగలు, అత్యాచారాలకు పాల్పడేవారు, కబ్జారాయుళ్లు, అవినీతిపరులకు వైసీపీ కేంద్రంగా మారిందన్నారు.జగన్ ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు, నలుగురు ఎంపీలు, 18మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. జగన్మోహన్‌రెడ్డి క్రిమినల్స్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజలు గమనించాలని చినరాజప్ప అన్నారు. 

Updated Date - 2021-08-24T23:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising