ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం అనుమతిస్తే డీఎస్సీ

ABN, First Publish Date - 2021-03-08T09:42:00+05:30

సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖల నుంచి అనుమతి లభించగానే డీఎస్సీ నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది టెట్‌.. త్వరలో ప్రకటన

పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి


అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖల నుంచి అనుమతి లభించగానే డీఎస్సీ నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు.  ఏటా డీఎస్సీ నిర్వహించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. మెగా డీఎస్సీనా లేదా సాధారణ డీఎస్సీనా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది కచ్చితంగా టెట్‌ ఉంటుందని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఆదివారం విజయవాడలో రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఎ‌స్‌ఈ సిలబ్‌సను అన్వయించుకోవడంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.


2022-23 విద్యా సంవత్సరంలో మొదటి సీబీఎ్‌సఈ బ్యాచ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో అనూహ్యంగా 5,26,424 మంది విద్యార్థులు పెరిగారని వివరించారు. ప్రస్తుతం పాఠశాలల్లో 45లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారని, నెల రోజుల్లో ప్రతి విద్యార్థికీ పుస్తకాలు అందజేస్తామన్నారు.

Updated Date - 2021-03-08T09:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising