ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు విచారణలో మారుతున్న సమీకరణలు!

ABN, First Publish Date - 2021-08-11T23:33:59+05:30

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సీబీఐ విచారణలో సమీకరణలు మారుతున్నాయి. గత నాలుగు రోజులుగా సీబీఐ బృందాలు విచారణలో దూకుడు పెంచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సీబీఐ విచారణలో సమీకరణలు మారుతున్నాయి. గత నాలుగు రోజులుగా సీబీఐ బృందాలు విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే  వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పులివెందులలో మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు రాఘవరెడ్డి, రమణారెడ్డిలను తొలిసారిగా సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా మొదట గుండెపోటు తోమరణించారని ఎలా చెప్పా రని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధిని కూడా పిలిచి ఇదే ప్రశ్నే అడిగినట్లు తెలుస్తోంది. గుండెపోటుతో అని ఎలా వార్తలు ప్రసారం చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది.


బుధవారం తెల్లవారుజామున కర్నాటక నుండి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కడపలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. అక్కడ జరిగిన ఆర్ధిక లావాదేవీలు, భూములుపై వివరాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పులివెందులలో సునీల్ తల్లి సావిత్రమ్మ, తమ్ముడు కిరణ్‌లను స్వగ్రామం మోటునూతనపల్లెకు సీబీఐ బృందం తీసుకెళ్లింది. పులివెందులకు చెందిన వివేకా అత్యంత సన్నిహితడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌లను సీబీఐ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ఇరువురిని కడపకు తరలిస్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-08-11T23:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising