ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనపై న్యాయపోరాటం: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-05-18T02:27:35+05:30

ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కరోనాను గాలికొదిలి కక్షసాధింపు చర్యల్లో నిమగ్నమైందని తప్పుబట్టారు. కరోనా వ్యాప్తిలో దేశం మొత్తం మీద ఏపీ రెండో స్థానానికి చేరిందన్నారు. 


‘‘చివరికి కోవాగ్జిన్ టీకాకి కూడా కులం అంటగట్టారు. తమ జాడ్యాలను ప్రతిపక్షాలపై నెట్టే కుట్రను ఖండిస్తున్నాం. కరోనా, బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు లోపభూయిష్టం. కరోనా నియంత్రణలో వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దుబారా, దోపిడీని ప్రక్కన పెట్టి కరోనా బాధితులకు వెంటనే ప్యాకేజీ ఇవ్వాలి. కొవిడ్‌ నియంత్రణకు వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-05-18T02:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising