ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు Chandrababu స్ట్రాంగ్ కౌంటర్..

ABN, First Publish Date - 2021-12-15T19:39:28+05:30

ఏపీ హైకోర్టును ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన సంచలన వ్యాఖ్యలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ హైకోర్టును ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన సంచలన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు!. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా?. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు. ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా!. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చా!. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఎవరేమన్నారు..!?

కాగా.. గత కొద్దిరోజులుగా చంద్రు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగానే మారాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు.. ఈ ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ఈ సందర్భంగా చంద్రుపై దేవానంద్ ప్రశ్నల వర్షం కురిపించారు.


అంతేకాదు.. ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు.. హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్ళి మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండని ఆయన చెప్పారు. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా? అని జస్టిస్ బట్టు ప్రశ్నించారు.


ఇంతకీ చంద్రు ఏమన్నారు..?

ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.

Updated Date - 2021-12-15T19:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising