ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Zero FIR : ABN MD RK చేసిన తప్పేంటి..? : జగన్ సర్కార్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-13T17:07:33+05:30

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో తాము సోదాలు జరుపుతున్నప్పుడు ఆటంకాలు సృష్టించారంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో రిటైర్డ్‌  ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో తాము సోదాలు జరుపుతున్నప్పుడు ఆటంకాలు సృష్టించారంటూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు విశ్లేషకులు, రాజకీయ, మీడియా ప్రముఖులు స్పందిస్తూ సీఐడీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఓ ప్రకటనలో స్పందించారు. రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు ఏబీఎన్ సిబ్బందిపై అక్రమంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.


ఆర్కే చేసిన తప్పేంటి..!?

దాదాపు 30 గంటల తర్వాత  జీరో ఎప్ఐఆర్ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, ఆ పార్టీ నేతల అవినీతిని ఏబీఎన్ సంస్ధలు ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రజలకు తెలియజేస్తున్నారన్న కారణంతో జగన్ రెడ్డి కక్షసాధిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు సంకెళ్లు ఎన్నాళ్లు వేస్తారు?. వేమూరి రాధాకృష్ణ ఏం నేరం చేశారని ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా..?. లక్షీనారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు?. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారు. వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ సీఐడి అధికారులు, సంస్ధ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలుపుతున్నారుఅని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక..!

ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా రెండున్నరేళ్లుగా మీడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగినా ఈ ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం?. 2430 జీవో తెచ్చి మీడియా గొంతు నొక్కారు. ఇలాంటి అణిచివేత ధోరణి, కక్ష సాధింపుచర్యల వల్ల జగన్ రెడ్డి ఎంతటి నియంతో అర్థమవుతోంది. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ప్రజాక్షేత్రంలో మీ తప్పులకు శిక్ష తప్పదు. వైసీపీ పాలనలో పౌరుల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పేపర్లకే పరిమితం. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించిన వ్యవస్థల్ని జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో నిర్వీర్యం చేశారు. జగన్ రెడ్డి పాలనంతా అప్పులు, తప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులుగా సాగుతోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-13T17:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising