ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-03-08T19:49:19+05:30

మీ చిల్లర రాజకీయాలు ఇక చెల్లవు.. గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ నాయకుల చిల్లర రాజకీయాలు ఇక చెల్లవు.. గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఇంత చిల్లర రాజకీయాలు చూడలేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, మాచర్ల రాజకీయాలు సాగనీయం. మీ అందరి తోక కట్ చేస్తా అని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి మూడు ముక్కలు చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా అన్నారు. దేశంలోని అందరినీ ఇక్కడకు రప్పించేందుకు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ1 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం మూడు ముక్కలాటతో అందరినీ ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.


గుట్కా ఎమ్మెల్యేకు మీరు ఊడిగం చేస్తే ... ఆ ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్లి జగన్‌కు ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఓటు విషయంలో మరోసారి తప్పు చేస్తే మీ జీవితాలు అధోగతిపాలేనని చెప్పారు. ప్రజలు కన్నెర్ర చేస్తే తాడేపల్లి నుంచి పారిపోతావ్ అని హెచ్చరించారు. టీడీపీ పాలనలో రౌడీయిజం, ఉగ్రవాదం, టెర్రరిజం లేకుండా చేశామన్నారు. నేను ఓట్లు కోసం రాలేదు.. మీ భవిష్యత్తు కోసం వచ్చానని వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడకుండా ఓటు వేయండి.. మీ ఓటు దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-08T19:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising