ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-08-03T01:49:11+05:30

ఏపీలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై ఈ నెల 7న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జగన్&కో అవినీతి, దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణాలు అని చెప్పారు. ‘‘ రూ.1200 కోట్ల రహదారి పన్నును దారిమళ్లించిన వైసీపీ ప్రభుత్వం, రోడ్డు సెస్ రూ.1200 కోట్లు దారి మళ్లించారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలి. రెండేళ్లయినా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయకపోవడం కోర్టు ధిక్కరణ చర్య. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సమస్యను పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. హోంమంత్రి డమ్మీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఆయా వర్గాలకు జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏపీఎస్ డీసీ ద్వారా అప్పులు తీసుకువచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేశారు. ఇది మౌలిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్రం లేఖ రాయడం జగన్ రెడ్డి తీరుకు నిదర్శనం.’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘మున్సిపల్ ఉద్యోగులు జీతాలు అడిగితే అరెస్ట్ చేసే దుస్థితిని జగన్ ప్రభుత్వం సృష్టించింది. ఉద్యోగులకు అండగా ఉండాలి. వివేకానందరెడ్డి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోంది. డా.సునీతారెడ్డి ఇచ్చిన జాబితాలోని ఇంటి వారిని ఇంకా ఎందుకు విచారించలేదు?. జగన్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెరిగింది. ఎక్కడా అభివృద్ధి లేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-03T01:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising