ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామపై దాడి అమానుషం.. పోలీసుల ప్రత్యేక చట్టాలున్నాయా?: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-05-16T02:01:08+05:30

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై దాడిని టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఎంపీ రఘురామను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై దాడిని టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఎంపీ రఘురామను పోలీసుల కొట్టడం వారి దమనకాండకు నిదర్శనమని అన్నారు. అక్రమ కేసులో అరెస్ట్ చేయడమేగాక గాయాలయ్యేలా కొడతారా అంటూ ప్రశ్నించారు. రఘురామ నేరస్తుడు కాదని, సీఐడీ పెట్టిన అక్రమ కేసులో నిందితుడు మాత్రమేనని అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు.


ప్రజలకు వ్యతిరేకంగా దారుణ పాలన చేస్తున్న జగన్ దుర్మార్గాలను నిలదీయడమే రఘురామ చేసిన నేరమా..? అంటూ ప్రశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకమే ప్రమాదంలో పడిందని, అయితే రాజ్యాంగం, న్యాయవ్యవస్థలు ఈ నమ్మకాన్ని తిరిగి నిలబెడతాయని తాను భావిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజ్యాంగ విలువలను రక్షణ కోసం తాను ప్రార్థిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఎక్కడైనా న్యాయం ప్రమాదంలో పడిందంటే.. అది దేశంలోని న్యాయవ్యవస్థకే ప్రమాదమని ఆందోళణ వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-16T02:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising