ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక రీచులు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం

ABN, First Publish Date - 2021-06-12T02:46:21+05:30

ఇసుక రీచులు ఇప్పిస్తానన్న కోట్లు కొట్టేసిన చంద్ర శేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇసుక రీచులు ఇప్పిస్తానంటూ కోట్లు కొట్టేసిన ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురిని ఇసుక రీచులతో పలు విధాలుగా మోసగిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు చంద్రశేఖర్ వైజాగ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గతంలో తెలంగాణలోని సైఫాబాద్‌ పోలీసు స్టేషనులో చంద్రశేఖర్‌పై కేసు నమోదైందని చెప్పారు. కర్రి సురేంద్ర నాధ్ నుంచి 2 కోట్లు వసూలు చేస్తు చంద్రశేఖర్ చిక్కినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్  తెలిపారు.


నిందితుడు చీటింగ్ చేయడానికి సీఎం జగన్, ఆయన ఓఎస్డీ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ప్రశంసా పత్రాలు తయారు చేసినట్టు  గుర్తించామన్నారు. అలాగే నిందితుడు మరికొందరిని మోసం చేసి కాకినాడ, వైజాగ్‌కు చెందిన వారి నుంచి మరికొంత డబ్బు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించామన్నారు. వీటితో పాటు నిందితుడు చంద్రశేఖర్‌పై మరో కేసు నమోదు చేస్తామన్నారు. సీఎం జగన్, ఆయన ఓఎస్డీ సంతకాల ఫోర్జరీపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. నిందితుడు చంద్రశేఖర్‌ని పూర్తిగా విచారిస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 

Updated Date - 2021-06-12T02:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising