ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన హామీల విషయంలో.. మొదటి దోషి కేంద్రం అయితే, రెండో దోషి రాష్ట్రం: చలసాని

ABN, First Publish Date - 2021-10-23T18:03:18+05:30

రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధగా ఉందని ఆంధ్రా మేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇంకా చలసాని మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధగా ఉందని ఆంధ్రా మేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇంకా చలసాని మాట్లాడుతూ.. ‘‘వైసీపీ, టీడీపీకి చెందిన వారుకొందరు.. మాపై బూతులతో  ట్రోల్ చేస్తున్నారు. మేము ఏ పాపం చేశాం? చంద్రబాబు, జగన్‌ని నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏమీ అనలేదు. విధానపరంగా మాత్రమే విమర్శించాను. స్టీల్ ప్లాంట్‌తో సహా అన్ని విషయాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేతే అధికార పక్షం ఎందుకు మాట్లాడం లేదు? విభజన హామీలు అమలు కాకపోవడానికి.. మొదటి దోషి కేంద్రం అయితే, రెండో దోషి రాష్ట్రం. కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదు? మీకు ఖలేజా ఉంటే పోరాడండి. మేమూ వస్తాం. నా కుటుంబంలో విషాదం జరిగింది. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాము. రాష్ట్ర ఎంపీలు ఏమి చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయని వారు ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ఒక స్టేజ్ మీదకు వస్తే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది’’ అన్నారు.

Updated Date - 2021-10-23T18:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising