ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3.5 కోట్ల నగదు సీజ్‌

ABN, First Publish Date - 2021-04-11T09:23:09+05:30

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఓ వ్యక్తి నుంచి రూ.3.5 కోట్ల నగదును ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో కిలో బంగారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.55.71 లక్షల బంగారు ఆభరణాలు కూడా

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో స్వాధీనం


కర్నూలు, ఏప్రిల్‌ 10: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఓ వ్యక్తి నుంచి రూ.3.5 కోట్ల నగదును ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప, డీఎస్పీ కేవీ మహేశ్‌ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన బీఏ చేతన్‌ కుమార్‌ చెన్నైకి చెందిన అరుణ్‌కుమార్‌ వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఓ పని కోసం మార్చి 28న చేతన్‌కుమార్‌ను విమానంలో రాయ్‌పూర్‌కు పంపగా, అక్కడి త్రీస్రార్‌ హోటల్‌ శ్రేష్టలో 10 రోజులు ఉన్నారు. అరుణ్‌కుమార్‌ సూచనల మేరకు కొంతమంది చేతన్‌కుమార్‌ను కలిసి పెద్ద మొత్తంలో నగదు అప్పగించారు. ఈ నెల 8న ఆ నగదుతో చేతన్‌కుమార్‌ బిలా్‌సపూర్‌కు వెళ్లారు. అక్కడ ప్రైవేటు ట్రావెల్స్‌ కారు బుక్‌ చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి  ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో బెంగళూరు బయల్దేరారు. కర్నూలు సమీప పంచలింగాల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఎస్‌ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య, సిబ్బంది తనిఖీ చేసి రూ.3.5 కోట్లు  గుర్తించారు.


ఈ నగదుకు ఆధారాలు లభించకపోవడంతో తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నగదు చెన్నైలో ఉన్న రామచంద్ర మెడికల్‌ కళాశాలకు చెందిన వారిదని విచారణలో చేతన్‌కుమార్‌ తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పీఎంజే జేమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌కు చెందిన సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌(లాజిస్టిక్స్‌ డిపార్టుమెంట్‌) కొప్పెర శ్రీకాంత్‌, కొప్పెర నరసింగరావు నుంచి మరో బస్సులో  రూ.55,71,600 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తమ ఓనర్‌ కుషాల్‌ జైన్‌ ఆదేశాల మేరకు కర్నూలు వెంకటరమణ కాలనీలోనీ పీఎంజే జేమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌కు ఇచ్చేందుకు వస్తున్నట్టు వారు తెలిపారు. బిల్లులు లేకపోవడంతో నగదు, ఆభరణాలను ఆదాయపన్నులశాఖకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. 

Updated Date - 2021-04-11T09:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising