ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై కేసు!

ABN, First Publish Date - 2021-01-07T07:44:20+05:30

‘ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం
  • మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొడుతున్నారు
  • బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు
  • సీఎం, హోం మంత్రి, డీజీపీ క్రైస్తవులని
  • హిందువులకు రక్షణ లేదన్నట్లు వ్యాఖ్యలు
  • ఆలయ ఘటనల వెనుక కుట్రకోణం: డీజీపీ


అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన మతం, ప్రాంతం గురించి మాట్లాడటం బాధించిందని చెప్పారు. నార్త్‌ ఈస్ట్‌ నుంచి వచ్చాడంటూ తనపై గతంలో వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం, హోం మంత్రి, తాను.. ముగ్గురం క్రైస్తవులం గనుక హిందువులకు రక్షణ లేదన్నట్లు వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమేనని అన్నారు. మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కుట్రలు చేస్తున్నారన్న అనుమానం ఉందని చెప్పారు. ‘దొంగలు, ఆకతాయిలు చేస్తున్నట్లు అనిపించడం లేదు.


ఘటనల్లో పోలిక ఉన్నందున కుట్ర కోణం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అన్నారు. రామతీర్థం ఆలయం కొండ కింద ఉందని, బోడికొండపై ఉండేది చిన్న గుడేనని చెప్పారు. కింద ఉన్న అసలైన గుడిలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఇలాంటివి చేశారంటే ప్రణాళికాబద్ధంగానే చేసినట్లు అనుమానం కలుగుతోందని చెప్పారు. సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేని ఆలయాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారంటే అనుమానించాల్సి వస్తోందని అన్నారు. రామతీర్థం బోడికొండపై దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను కచ్చితంగా జైలుకు పంపుతామని, దేవుళ్లతో ఆటలాడే వ్యక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. రామతీర్థం ఘటనలో కీలకమైన ఆధారాలు లభించాయని, వాటితో సహా బాధ్యులను అతిత్వరలో మీడియా ముందు, తర్వాత కోర్టులో ప్రవేశపెడతామని డీజీపీ చెప్పారు. ఈ ఘటనల్లో అనుమానితుల ఫోన్‌ నంబర్ల కాల్‌ డేటా చాలా విషయాలు తెలియజేస్తోందన్నారు.

Updated Date - 2021-01-07T07:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising