ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్చలపై పురోగతి ఉంటేనే పిలవండి: బొప్పారాజు

ABN, First Publish Date - 2021-12-30T23:25:59+05:30

ఉద్యోగులను అవమానించే విధంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగులను అవమానించే విధంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల కోసమే 100 శాతానికిపైగా రాష్ట్ర ఆదాయం ఖర్చు చేస్తుంటే.. ఎందుకు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారని ప్రశ్నించారు. నియామకాలు చేస్తున్నారంటే రాష్ట్ర ఆదాయం బాగానే ఉందని అర్థమన్నారు. 


‘‘చర్చలకు ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తే ఫిట్‌మెంట్ అన్నారు. మీ అంకె ఎంత అని అడిగాం. మళ్లీ 14.29 శాతం అంటున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీతాలు ఎక్కువ తీసుకున్నామంటున్నారు. 39 శాతం, 43 శాతం చప్పున ఎక్కువ ఇచ్చారు అంటున్నారు. 2100 కోట్ల నగదు ఉపసంహరణకు పెట్టుకున్నాం... వాటి ఊసేలేదు. చర్చలపై పురోగతి ఉంటేనే పిలవండి.  లేదా సీఎంతో సమావేశానికి పిలవండి. 21 శాతం డీఏలు ఇంకా పెండింగ్ ఉన్నాయి’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2021-12-30T23:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising