ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూగబోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్లు

ABN, First Publish Date - 2021-04-11T09:09:34+05:30

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఆ నెట్‌వర్క్‌ ఫోన్లు మూగబోయాయి. శనివారం రోజంతా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్లోన్లు ఉలుకుపలుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ/ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఆ నెట్‌వర్క్‌ ఫోన్లు మూగబోయాయి. శనివారం రోజంతా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్లోన్లు ఉలుకుపలుకు లేకుండా ఉన్నాయి. గుంటూరులో ఉన్న ఎంఎ్‌ససీ (మొబైల్‌ స్విచ్చింగ్‌ సెంటర్‌)లో ఏర్పడిన సాంకేతిక సమస్య దీని కారణమని గుర్తించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగుల ఫోన్లన్నీ ఒకేసారి మోగకపోవడంతో అనుమానం వచ్చింది. తర్వాత కాసేపటికి ఆ శాఖ వాట్సాప్‌ గ్రూపులో ఎంఎ్‌ససీలో సాంకేతిక సమస్య ఏర్పడిందని మెసేజ్‌ వచ్చింది.


ఏ సర్వీసు ప్రొవైడర్‌కు చెందిన సిమ్‌లు పనిచేయాలన్నా ఈ ఎంఎ్‌ససీలే కీలకం. ఇక్కడి నుంచి సిగ్నల్స్‌ సక్రమంగా ఉన్నప్పుడే అవుట్‌ గోయింగ్‌, ఇన్‌ కమింగ్‌ కాల్స్‌లో స్పష్టత ఉంటుంది. రాష్ట్రంలో బీఎ్‌సఎన్‌ఎల్‌కు చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నంలో మొబైల్‌ స్విచ్చింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. గుంటూరులో ఉన్న ఎంఎ్‌ససీ... గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను కవర్‌ చేస్తుంది. ఇక్కడి సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఆ మూడు జిల్లాల్లో ఫోన్లు సాయంత్రం వరకూ పనిచేయలేదు. 

Updated Date - 2021-04-11T09:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising