ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్‌ఫంగస్‌

ABN, First Publish Date - 2021-05-20T09:38:21+05:30

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే వెసులుబాటను ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు బ్లాక్‌ ఫంగ్‌సకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 41,968 ప్యాకేజీ ఇవ్వనున్న ట్రస్ట్‌.. ఉత్తర్వులు జారీ 


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే వెసులుబాటను ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు బ్లాక్‌ ఫంగ్‌సకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్‌ ఆరోగ్యశాఖ సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందదే. ప్రస్తుతం కొవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా తగ్గిన తర్వాత సక్రమించే బ్లాక్‌ ఫంగ్‌సను కూడా అదే కోవలోకి తీసుకువచ్చారు. దీన్ని ఎపిడమిక్‌ డిసీజ్‌ కింద ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ పరిగణించింది. దీని చికిత్సకు అత్యధికంగా రూ.41,968 ప్యాకేజీ నిర్ణయించింది. యాంఫోటెరిసిన్‌-బి, ఫోసాకోనజోల్‌ ఇంజక్షన్లు మాత్రం ఎంఆర్‌పీ ఆధారంగా ట్రస్ట్‌ చెల్లిస్తుంది. ఆ ఇంజెక్షన్లకు సంబంధించిన సమాచారం రోగుల బిల్లులతో పాటు పంపించాలని సూచించింది. బిల్లులో ఇంజక్షన్‌, వైల్‌ ఫోటోతో పాటు బార్‌కోడ్‌ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అందించాలి. ఆరోగ్యశాఖ ఉత్తర్వులు బుధవారం నుంచే అమలులోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-20T09:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising