తిరుపతిలో బీజేపీ విజయం ఖాయం: కన్నా
ABN, First Publish Date - 2021-04-09T18:49:12+05:30
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శలు గుప్పించారు. ..
గుంటూరు : తిరుపతి ఉప ఎన్నికలో కచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు గుంటూరులో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ భయపడే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారని.. వైసీపీ, టీడీపీకి ఓటేస్తే ఉపయోగం లేదని జనాలు భావిస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. తిరుపతిలో బీజేపీ-జనసేనల ప్రచారం ఉత్సాహంగా సాగుతోందన్నారు. గుంటూరులోని బ్రాడిపేటలో ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నా పై వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2021-04-09T18:49:12+05:30 IST