ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యం

ABN, First Publish Date - 2021-06-19T01:26:50+05:30

ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి చైర్మన్, డిప్యూటి చైర్మన్ పదవీకాలం ముగియడంతో వి.బాలసుబ్రహ్మణ్యంను నియమించారు. సోమవారం నూతన సభ్యులతో ప్రొటెం చైర్మన్  ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త చైర్మన్ ఎన్నిక వరకు ఈ పదవిలో బాలసుబ్రహ్మణ్యం కొనసాగుతారు. ఈయన మూడు సార్లు మండలికి ఎన్నికయ్యారు.


గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), మోషేన్‌ రాజు (పశ్చిమ గోదావరి), ఆర్‌వీ రమేశ్‌ యాదవ్‌ (కడప), తోట త్రిమూర్తులును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమేరకు గవర్నర్‌ విశ్వభూణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కోటాలో నలుగురు వైసీపీ సభ్యులు మండలిలో చేరుతున్నారు. శుక్రవారంతో ఏడుగురు తెలుగుదేశం సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వైసీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రిటైరవుతున్నారు. దీంతో మండలిలో వైసీపీ బలం 20కి పెరిగితే.. టీడీపీ సభ్యుల సంఖ్య 15కు పరిమితం కానుంది.

Updated Date - 2021-06-19T01:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising