ఏపీ భవన్లో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి
ABN, First Publish Date - 2021-04-06T09:04:03+05:30
ఆంధ్రప్రదేశ్ భవన్లో బడుగు వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ 113వ జయంతి వేడుకలు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్‌త్రిపాఠి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ భవన్లో బడుగు వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ 113వ జయంతి వేడుకలు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్‌త్రిపాఠి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-06T09:04:03+05:30 IST