ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవును దేశ మాతగా ప్రకటించాలి: బాబా రాందేవ్

ABN, First Publish Date - 2021-11-01T02:00:39+05:30

గోవును దేశ మాతగా ప్రకటించాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: గోవును దేశ మాతగా ప్రకటించాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న టీటీడీ గో మహా సమ్మేళనంలో బాబా రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గోవును భారతీయ మాతగా మోదీ, అమిత్ షాలు ఉన్నపుడు కాకపోతే ఇక ఎప్పుడు ప్రకటించటం సాధ్యమని రాందేవ్ బాబా ప్రశ్నించారు. జమ్ము కాశ్మీర్, రామ మందిరం, గోవును దేశ మాతగా ప్రకటించటం ఇవి ఎప్పటికి సాధ్యం కాదన్నారు. కానీ మొదటి రెండింటిని సాధ్యం చేసారన్నారు. అలాగే మూడోది నిజం కాబోతోందన్నారు. పార్లమెంటులో గోవును దేశ మాతగా ప్రకటించాలన్నారు. చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.


అన్ని ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు, సాధువులు, అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, దేశంలోని అన్ని ఆలయాల నుంచి గోవును దేశమాతగా ప్రతిపాదిస్తూ మోదీకి ప్రతిపాదనలు వెళ్లాలన్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ నుంచి ఇలాంటి ప్రతిపాదన వెళితే అది ఆచరణలోకి వచ్చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దేశవాళి గోవుల సేవ కోసం పతంజలి సంస్థ 500 కోట్లు ఖర్చు చేయటానికి సిద్ధమని రాందేవ్ బాబా ప్రకటించారు. 

Updated Date - 2021-11-01T02:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising