ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు రిటైర్ అయినా వదలం.. భరతం పడతాం: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-01-21T21:22:17+05:30

పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరి పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు బుర్ర లేదన్నారు. ప్రభుత్వం ఏం చెబితే అది కేసు రాయడం, అరెస్టు చేయడమే తెలుసునని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని, ఆలోచనతో పనిచేయాలని సూచించారు. వంటిపై వేసుకున్నది ఖాకీ డ్రస్ అని, వైసీపీ జండా కాదని తెలుసుకోవాలన్నారు. పోలీసులే ఈ రకంగా వ్యవహరిస్తే ఇక రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే సమస్యలేదని, నాయకులు, అధికారులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని, అలాగని అన్యాయంగా ఎవరినీ ఇబ్బందిపెట్టమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని, ఎవరినీ విడిచిపెట్టేదిలేదని అచ్చెన్నాయుడు మరోసారి హెచ్చరించారు.

Updated Date - 2021-01-21T21:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising