ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరెస్టులతో భయపెట్టాలనుకుంటున్నారు.. అశోక్ గజపతి

ABN, First Publish Date - 2021-01-21T18:35:45+05:30

టీడీపీ నేతల అరెస్టులపై మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: టీడీపీ నేతల అరెస్టులపై మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళా వెంకట రావును అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే స్వతంత్ర దేశంలో ఉన్నామా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. సుప్రీం కోర్టు రూల్స్ ప్రకారం ట్రయిల్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారిని నిర్బంధించాలని, కానీ కోర్టులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. 


రామతీర్థం పరిశీలనకు చంద్రబాబుకి అనుమతి ఇచ్చిన తరువాత  వేరే వాళ్ళకి అదే సమయంలో అనుమతి ఎలా ఇస్తారన్నారు. వంశపారపర్యత ట్రస్టుకు సమాచారం ఇవ్వకుండా, 16 నెలలు జైల్లో ఉన్న దొంగకు మాత్రం చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఆధారాలు తారుమారు చేయరన్న నమ్మకం ఏంటి? ప్రతి ఒక్కరూ భయపడాలన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. స్వాతంత్ర్య కోసం ఎలా పోరాడారో ఇప్పుడు అలానే పోరాడుతామని ప్రకటించారు. కరోనా వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు నిలిపివేయాలని వాళ్లే కోరిన విషయం తెలిసిందేనన్నారు. గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్‌గా మారే వరకు జిల్లాని పట్టించుకోలేదని, రాజ్యాంగాన్ని ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని వాపోయారు. 

Updated Date - 2021-01-21T18:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising