ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికను మోసం చేసిన కేసులో నిందితుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-12-25T23:27:52+05:30

బాలికను మోసం చేసిన కేసులో నిందితులను అర్బన్ పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బాలికను మోసం చేసిన కేసులో నిందితులను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. మొత్తం ఇరవై మూడు మంది  ముఠాలో ఉన్నారన్నారు. పదిమంది ఆర్గనైజర్స్ ఉన్నారన్నారు. కరోనా సమయంలో జీజీహెచ్‌లో చేరిన బాలికకు మాయ మాటలు చెప్పి స్వర్ణ కుమారి అనే మహిళ తీసుకెళ్ళిందన్నారు. ప్రకృతి వైద్యం పేరుతో తీసుకెళ్ళి ఆ బాలికతో వ్యభిచారం చేయించిందన్నారు.


విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరు, తదితర ప్రాంతాల్లో వ్యభిచారం చేయించారన్నారు. నెల్లూరు నుంచి పారిపోయి విజయవాడ వచ్చిన బాలికను తిరిగి పట్టుకొని మళ్లీ వ్యభిచారం చేయించారని ఆయన పేర్కొన్నారు. అయితే అనారోగ్యం బారిన పడటంతో బాలికను వదిలి పెట్టారన్నారు. ఈ ఘటనలో పదమూడు మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, 1000 నగదు, కారు, ప్రామిసరీ నోట్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ సుప్రజ, పోలీసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T23:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising