ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లీషు రాకపోతే ఏ బాత్రూమ్‌లో దూరుతామో అర్థం కాదు: YCP MLA సెటైర్స్

ABN, First Publish Date - 2021-11-27T09:11:59+05:30

ఇంగ్లిష్‌ రాకపోతే ఏ బాత్రూమ్‌లోకి వెళ్లాలో కూడా తెలియక ఇబ్బంది పడతామని శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  తెలుగు తల్లి, ఇంగ్లిష్‌ భార్య అంటూ పోలిక
  •  లుంగీ, ప్యాంట్‌ రెండూ కావాలని మరో ఉదాహరణ
  •  వింత పోలికలతో ఎమ్మెల్యే బియ్యపు ప్రసంగం


అమరావతి : ఇంగ్లిష్‌ రాకపోతే ఏ బాత్రూమ్‌లోకి వెళ్లాలో కూడా తెలియక ఇబ్బంది పడతామని శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే లుంగీలను తెలుగుతోనూ, ప్యాంట్లను ఇంగ్లిష్‌తోనూ ఆయన పోల్చారు. రోజంతా ప్యాంట్లు వేసుకున్నా రాత్రి లుంగీలు కట్టుకుంటామంటూ...రెండు భాషలూ అవసరమేనన్నారు. తెలుగు తల్లిలాంటిదని, ఇంగ్లిష్‌ భార్యలాంటిదని చెప్పారు. శాసనసభ సమావేశాల చివరిరోజు విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అందులో ఇంగ్లిష్‌ మీడియం అవసరాన్ని గురించి మాట్లాడుతూ విచిత్రమైన పోలికలు తెచ్చారు. ఆయన ఇంగ్లిష్‌పై మాట్లాడుతున్నంతసేపూ స్పీకర్‌ సహా అందరూ నవ్వుతూనే కనిపించారు.


అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తమిళనాడులో పుట్టి ఇంగ్లిష్‌ నేర్చుకుని అమెరికా వెళ్లారన్నారు. ఇక చివర్లో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ...గ్రీకులో ఒక సామెత ఉందని దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన తెచ్చుకున్న పేపరు కనిపించలేదు.. ‘కావాలంటే గూగుల్‌లో కొట్టి చూడాల’ని సభ్యులకు సూచించారు. చివరకు ఆయన తెచ్చుకున్న సామెతలపేపరు దొరకింది. అందులో ఏముందో చదివి వినిపించాలని సహచర సభ్యులు కోరగా....‘అది గ్రీకులో ఉంది’ అని తన ప్రసంగాన్ని ముగించారు. 

Updated Date - 2021-11-27T09:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising