ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6.32 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ABN, First Publish Date - 2021-11-21T08:12:52+05:30

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల ప్రాథమిక అంచనా

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగాఅంచనా వేశారు. 5.83లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 49వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. కడప జిల్లాలో 3,60,197, అనంతలో 2,30,322, నెల్లూరులో 29,981, చిత్తూరులో 12,237 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లో 172 మండలాల్లోని నాలుగు నగరాలు, 1,316 గ్రామాలపై వాయుగుండం ప్రభావం చూపిందని గుర్తించారు. 24 మంది మృతి చెందారని, 17మంది గల్లంతయ్యారని తేల్చారు. రూ.5.02 కోట్ల విలువైన 1,549 గృహాలు దెబ్బతిన్నాయని, రూ.2.31 కోట్ల విలువైన 612 పశువులు, 1,791 చిన్న జీవాలు, 3,232 కోళ్లు మృత్యువాతపడ్డాయని నిర్ధారించారు. సహాయ చర్యల కోసం కడప జిల్లాకు రూ.2.5 కోట్లు, చిత్తూరుకు రూ.2కోట్లు, నెల్లూరుకు రూ.కోటిన్నర, అనంతకు రూ.కోటి విడుదల చేశారు. మొత్తం 243 శిబిరాలు ఏర్పాటు చేసి, వాటిలోకి 20,923 మందిని తరలించారు. ముంపులో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లే వ్యక్తిలకు రూ.వెయ్యి, కుటుంబానికైతే రూ.2వేలు తక్షణ సాయంగా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-21T08:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising